AP Corporation Loans 150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి ఇస్తున్నారు. మరి ఆ 150+ వ్యాపారాలు ఏవో చూడండి

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Corporation Loans | 150 పైగా వ్యాపారాలు

AP Corporation Loans 2025: కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. BC, EWS, OC కులాలకు చెందిన పురుషులు మరియు మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ AP Corporation Loan కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, పూర్తిగా ఉచితం.

AP BC Corporation Loan కు AP OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయం లేదా ఇంటర్నెట్ సెంటర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

AP Corporation Loan Amount Details 2025

AP ప్రభుత్వం మొత్తం రుణాన్ని మూడు స్లాబ్‌ల కింద విభజించింది.

SlabLoan AmountSubsidyBank Loan
Slab 1రూ.2 లక్షల లోపుయూనిట్ కాస్ట్ పై 50% (రూ.75,000 వరకు)బ్యాంకు లోన్ రూ.1,25,000 వరకు
Slab 2రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకురూ.1,25,000 (100% Subsidy)బ్యాంకు లోన్ రూ.1,75,000 వరకు
Slab 3రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకురూ.2,00,000 (100% Subsidy)బ్యాంకు లోన్ రూ.3,00,000 వరకు

వడ్డీ రేటు: అన్ని బ్యాంకు లోన్లపై వడ్డీ 12% లోపు ఉంటుంది.

Eligibility Criteria for AP Corporation Loans 2025

  • ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసి అయి ఉండాలి.
  • BC, EWS, OC కులాలకు చెందిన వారు మాత్రమే అర్హులు.
  • రేషన్ కార్డు లేదా రైస్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
  • 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • మొబైల్ నెంబర్ ఉండాలి.
  • చదువుతో సంబంధం లేదు (Pass Certificate ఉంటే ఇవ్వవచ్చు, లేకుంటే అవసరం లేదు).
  • వాహన రంగం లో లోన్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • మెడికల్ షాప్ ప్రారంభించాలనుకుంటే D Pharmacy/B Pharmacy/M Pharmacy సర్టిఫికెట్ ఉండాలి.

Required Documents for AP Corporation Loans 2025

  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్ (వాహన రంగం కోసం)
  • D Pharmacy/B Pharmacy/M Pharmacy (మెడికల్ షాప్ కోసం)
  • మొబైల్ నెంబర్

AP Corporation Loans 2025 Categories

AP BC Corporation Loans 2025 కింద 6 ప్రధాన రంగాలు ఉన్నాయి. వీటిలోని వ్యాపారాలకు మాత్రమే ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుంది.

1. వ్యవసాయ రంగం (Agriculture Sector)

  • వ్యవసాయ యంత్రాలు & పనిముట్లు
  • బండి & ఎద్దులు
  • కంప్రెసర్ ట్రాక్టర్
  • డ్రోన్ స్ప్రేయర్
  • మినీ ట్రాక్టర్
  • మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ
  • మౌంటెడ్ స్ప్రేయర్
  • బహుళ పంట త్రషర్
  • ముష్రూమ్ సాగు యూనిట్
  • ఆయిల్ ఇంజిన్ (20 HP)
  • పవర్ ట్రిల్లర్
  • ట్రాక్టర్
  • ట్రైలర్‌తో ట్రాక్టర్

2. పశు సంపద రంగం (Animal Husbandry)

  • మిల్క్ కాటిల్ (పశు సంవర్థన)
  • పౌల్ట్రీ ఫారం

3. వ్యాపార రంగం (Business Sector)

  • ఆటో మొబైల్ షాప్ (విడిభాగాలు)
  • బ్యాటరీ యూనిట్
  • పుస్తకాల బైండింగ్
  • పుష్పగుచ్ఛాలు & దండల వ్యాపారం
  • ఇనుము గేట్ల తయారీ
  • ఇనుప అల్మారాలు
  • ఫర్నిచర్ దుకాణం
  • జనరల్ స్టోర్ & కిరాణా దుకాణం
  • బట్టల వ్యాపారం
  • ఫాన్సీ & జనరల్ స్టోర్
  • మొబైల్ సేల్స్ & సర్వీసింగ్ సెంటర్
  • మటన్/చికెన్ షాప్
  • పికెల్ & పాపడ్ తయారీ
  • స్టేషనరీ & పుస్తక దుకాణం
  • ట్రంక్ బాక్స్ తయారీ
  • వెల్డింగ్ దుకాణం
  • పెయింట్ దుకాణం
  • దుస్తుల తయారీ

4. పరిశ్రమల రంగం (Industries Sector)

  • ఇటుక తయారీ / ఫ్లై యాష్ ఇటుకలు
  • ఆధునిక & అధునాతన యంత్రాలతో వడ్రంగి పని
  • బంగారం (స్వర్ణకారుడు)
  • గ్రానైట్ స్టోన్/మార్బుల్స్ పాలిషింగ్ & అమ్మకం
  • నూడుల్స్ తయారీ
  • పేపర్ ప్లేట్లు & డిస్పోజబుల్ గ్లాసెస్ తయారీ
  • దిండ్లు & పడకల తయారీ యూనిట్
  • పాలీ బ్యాగుల తయారీ
  • RO వాటర్ ప్లాంట్
  • చిప్స్ తయారీ (అరటి/బంగాళాదుంప)

5. సేవా రంగం (Service Sector)

  • 2 వీలర్ & 4 వీలర్ మరమ్మతు
  • AC & ఫ్రిజ్ సర్వీస్
  • కంప్యూటర్ డిటిపి & జిరాక్స్
  • సెల్ ఫోన్ మరమ్మతు
  • ఫోటో స్టూడియో
  • బ్యూటీ పార్లర్లు & స్పా
  • డ్రై ఫ్రూట్స్ అమ్మే దుకాణం
  • ప్లంబింగ్ పనులు

6. వాహన రంగం (Transport Sector)

  • రవాణా
  • ఈ-ఆటోలు (3 వీలర్లు)
  • మినీ వ్యాన్ (ప్యాసింజర్ / ట్రక్)
  • మినీ వ్యాన్లు (లగేజీ క్యారియర్లు)
  • ప్యాసింజర్ ఆటో / ట్రక్ ఆటో (డీజిల్)

AP Corporation Loans 2025 Online Application Process

  1. AP OBMMS వెబ్‌సైట్‌కి వెళ్లాలి → Apply Here
  2. కొత్త AP Corporation Loan Application Form పూరించాలి.
  3. తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  4. అప్లికేషన్ గ్రామంలో MPDO లేదా పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ కు సమర్పించాలి.
  5. AP BC Corporation Loan Approval Process పూర్తి అయితే మీకు రుణం మంజూరు అవుతుంది.

AP Corporation Loan 2025 FAQs

1. AP BC Corporation Loan అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అవసరమా?
లేదు, పూర్తిగా ఉచితం.

2. ఏఏ కులాలకు AP Corporation Loans 2025 వర్తిస్తాయి?
BC, EWS, OC కులాలకు మాత్రమే వర్తిస్తుంది.

3. AP BC Corporation Loan కు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం?
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, సంబంధిత ట్రైనింగ్/డిగ్రీ సర్టిఫికేట్లు.

4. AP BC Corporation Loan అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
AP OBMMS Website లో స్టేటస్ చెక్ చేయవచ్చు.

5. బ్యాంక్ నుండి ఎంత వరకు రుణం వస్తుంది?
స్లాబ్‌ను బట్టి రూ.1,25,000 – రూ.3,00,000 వరకు రుణం వస్తుంది.

ముఖ్యమైన లింకులు

AP Corporation Loans Apply Online: apobmms.cgg.gov.in
Application Status Check: apobmms.cgg.gov.in

మీరు AP Corporation Loans 2025 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సహాయక కేంద్రాన్ని సంప్రదించండి లేదా మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించండి.

Ap corporation Loans 2025 with 150 Type Of Business Categoriesటవర్ లేకుండానే ఇంటర్నెట్ – భారత్‌లో స్టార్‌లింక్ సర్వీస్ ఎప్పటి నుంచి?

Ap corporation Loans 2025 with 150 Type Of Business CategoriesAPPSC కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ 2025 – ముఖ్యమైన సమాచారం

Ap corporation Loans 2025 with 150 Type Of Business Categoriesఇంట్లో నుంచే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు – పూర్తి వివరాలు

Ap corporation Loans 2025 with 150 Type Of Business Categoriesఇంట్లోనే సినిమా థియేటర్ అనుభవం! TecSox LUMA LED 4K ప్రొజెక్టర్ కేవలం ₹3,749కే!

Tags: AP Corporation Loans 2025, BC Corporation Loan, EWS Loan AP, OC Loan AP, AP OBMMS Loan, AP Subsidy Loan, AP Business Loan, AP Corporation Loan Eligibility, AP Corporation Loan Apply Online, AP Government Loans

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

4 thoughts on “AP Corporation Loans 150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి ఇస్తున్నారు. మరి ఆ 150+ వ్యాపారాలు ఏవో చూడండి”

  1. అన్నీ జిల్లాలకు వర్తిస్తుందా చివరి తేదీ ఎప్పుడు?

    Reply

Leave a Comment

WhatsApp