ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Vidyarthi Mithra Kits: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త! వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ప్రభుత్వం ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది. గతంలో జగనన్న విద్యాకానుక పేరుతో ఇచ్చిన స్కూల్ కిట్లను ఇప్పుడు నూతన పేరుతో మరింత మెరుగైన నాణ్యతతో పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఏపీలో వీరికి రూ. 4 వేలతో కొత్త పింఛన్ల జారీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి
Vidyarthi Mithra Kits టెండర్ల ప్రక్రియ పూర్తి – రూ.63.79 కోట్లు ఆదా
ఈసారి టెండర్ల విధానాన్ని పూర్తిగా మారుస్తూ, అధిక పోటీ తెచ్చి తక్కువ ధరకే అధిక నాణ్యత గల స్కూల్ కిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా టెండర్ల ద్వారా గత ప్రభుత్వంతో పోల్చితే రూ.63.79 కోట్లు ఆదా అయ్యాయని అధికారులు వెల్లడించారు. గతంలో కంటే తక్కువ ధరలో, మరింత మెరుగైన కిట్లు విద్యార్థులకు అందించేందుకు గుత్తేదారులు ముందుకొచ్చారు.
ఏపీ లోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త: తక్కువ వడ్డీతో రూ.1 లక్ష రూపాయల ఋణం
విద్యార్థి మిత్ర కిట్‌లో ఏముంటుంది?
విద్యార్థుల కోసం ఈ కిట్‌లో అనేక అవసరమైన వస్తువులు ఉచితంగా అందించనున్నారు:
- స్కూల్ బ్యాగ్
- ఒక జత బూట్లు, బెల్ట్
- మూడు జతల యూనిఫామ్
- నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు
ఏపీ ప్రజలకు అలర్ట్..! ఈ తప్పు చేసిన వారికి సంక్షేమ పథకాలు రద్దు..!
వినియోగదారులకు తక్కువ ఖర్చుతో మెరుగైన కిట్లు
ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో గతంలో కంటే తక్కువ ధరకే మెరుగైన నాణ్యత గల సామగ్రి విద్యార్థులకు అందనుంది. గతంలో ఒక్కో విద్యార్థి కిట్‌పై రూ.1,900 పైగా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు రూ.1,858 మాత్రమే ఖర్చవుతోందని అధికారులు చెబుతున్నారు.
వస్తువుల ధరల తేడాలు:
- బ్యాగ్ – గతంలో రూ.272.92, ఇప్పుడు రూ.250
- బూట్లు, సాక్సులు – గతంలో రూ.187.48, ఇప్పుడు రూ.159.09
- యూనిఫామ్ (మూడు జతలు) – గతంలో రూ.1,081.98, ఇప్పుడు రూ.1,061.43
- బెల్ట్ – గతంలో రూ.34.50, ఇప్పుడు రూ.24.93
- నోట్ పుస్తకాలు – గతంలో రూ.50, ఇప్పుడు రూ.35.64
ఏపీలోని విద్యార్థి తల్లి అకౌంట్లో రూ.15 వేలు జమ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ కిట్ల పంపిణీ
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. విద్యాశాఖ పంపిణీకి సంబంధించిన పనులను వేగవంతం చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఉచిత స్కూల్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మార్పుతో లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రి ఉచితంగా అందనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది.
Tags: విద్యార్థి మిత్ర కిట్లు, ఉచిత స్కూల్ కిట్, సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కిట్, విద్యార్థులకు స్కూల్ కిట్