ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Girl Child Scheme: విజయనగరం పార్లమెంట్ పరిధిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ కలిశెట్టి ఓ వినూత్నమైన పథకాన్ని ప్రకటించారు. కుటుంబంలో మూడో సారి ఆడబిడ్డ జన్మిస్తే, ఆ బాలిక భవిష్యత్తు కోసం తక్షణమే రూ.50,000 బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాదు, అదే కుటుంబంలో మూడో సారి మగబిడ్డ పుట్టినట్లయితే, ఆ కుటుంబానికి ఆవు, దూడను బహుమతిగా అందజేస్తానని తెలిపారు.
ఎంపీ కలిశెట్టి కీలక ప్రకటన | Girl Child Scheme
ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించిన ఎంపీ కలిశెట్టి, దీనివల్ల మహిళల ప్రాధాన్యత పెరిగి, సమాజంలో లింగ సమతుల్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను తక్కువగా చూసే భావనను మారుస్తూ, వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పథకం అమలు వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ ప్రకటనపై సామాజిక వర్గాల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అభినందిస్తుండగా, మరికొందరు ఇది ప్రోత్సాహకరమైన చర్య కాదని భావిస్తున్నారు. మరి, ఈ పథకం విజయవంతం అవుతుందా? సమాజంలో ఎంతవరకు మార్పు తెస్తుందో చూడాలి!
ఏపీలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ – ఉచిత బస్సు ప్రయాణం వివరాలు
తల్లికి వందనం పథకం – 72 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై బిగ్ షాక్..ఈ షరతులు తప్పనిసరి!…ఎవ్వరూ ఊహించని ట్విస్ట్?
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ – ఇక వాట్సాప్‌లో 200 ప్రభుత్వ సేవలు!
Tags: విజయనగరం ఎంపీ ప్రకటన, మూడో సారి ఆడబిడ్డ స్కీమ్, మగబిడ్డకు ఆవు దూడ బహుమతి, మహిళా దినోత్సవ ఆఫర్, ఆడబిడ్డకు నగదు బహుమతి