ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్లలో చేరండిి
Thalliki Vandanam 15K: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెద్ద ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం క్రింద ఇప్పుడు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని, ఎలాంటి వివక్షలు లేకుండా మే నెలలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏపీ రైతులకు శుభవార్త! ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ..ఉచితంగానే
ప్రస్తుతం విద్యా శాఖ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిసింది. “ఏ విద్యార్థిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికీ ఈ సహాయం చేరుతుంది. డబ్బులు ఖచ్చితంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకే జమవుతాయి” అని లోకేష్ వివరించారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ ప్రణాళికను ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు ప్రతిపాదించారు. విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
రేషన్ కార్డు ఉన్న పేదలకు 3 సెంట్లు స్థలం, ₹4 లక్షలు సాయం – వెంటనే అప్లై చేయండి!
డీఎస్సీ భర్తీలు & ఉపాధ్యాయ నియామకాలు:
తల్లికి వందనం పథకంతోపాటు, డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 70% ఉపాధ్యాయ భర్తీలు చేసినట్లు, కానీ వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క పోస్టు భర్తీ కూడా జరగనట్లు ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను పారదర్శకంగా ముందుకు తీసుకువస్తోందని విశదీకరించారు.
మైక్రోసాఫ్ట్ రిక్రూట్మెంట్ 2025: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు (Freshers & Experienced)
Thalliki Vandanam 15K రాజకీయ వాగ్వాదాలు & బీసీల సహాయం:
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించగా, మంత్రి లోకేష్స,సవిత,వెంకటనరసింహారెడ్డి ప్రతిస్పందించారు. “గత ప్రభుత్వం బీసీలను అణచివేసింది. అమర్నాథ్ గౌడ్ హత్యలాంటి సంఘటనలు జరిగాయి. మేం 8 నెలల్లోనే స్వయం ఉపాధి పథకాలకు రూ.1,977 కోట్లు ఖర్చు చేశాం” అని సవిత పేర్కొన్నారు. అలాగే, బీసీ సంఘాలకు రుణ సబ్సిడీలు, ఉచిత టైలరింగ్ శిక్షణల ద్వారా సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు చంద్రబాబు ప్రకటన
ఈ పథకాలన్నీ ప్రజల డబ్బును ప్రజలకే చేరుస్తున్నాయని, ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకతతో పని జరుగుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విద్యార్థులు మరియు తల్లులు తప్పకుండా మే నెలలో ఈ ప్రయోజనాలను పొందేలా చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలిపారు.
Tags: తల్లికి వందనం పథకం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా లోకేష్, విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఏపీ పథకాలు, తల్లికి వందనం పథకం, AP Student Benefits, Nara Lokesh Announcement, AP Rs.15000 Scheme, Andhra Education News