ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్లలో చేరండిి
Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లల వరకే పరిమితమైన ప్రసూతి సెలవులను ఇకపై ఎంత మంది పిల్లలున్నా వర్తించేట్టు చట్ట సవరణ చేస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళలకు మరింత సహాయం చేసినట్టు అవుతుంది.
ప్రసూతి సెలవుపై సీఎం కీలక ప్రకటన
ఇంతకుముందు అధిక సంతానం వద్దని తానే చెప్పానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజల్లో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లలు కనాలని చెబుతున్నట్లు వెల్లడించారు. దీనితో, కుటుంబం పెంచు కోవాలనుకునే ఉద్యోగులకు ఇది మంచి అవకాశం.
ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం – CM Chandrababu Naidu
అంతేకాదు, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని కూడా సీఎం పేర్కొన్నారు. ఇది మహిళా ఉద్యోగులకు ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు మరింత అనుకూలమైన విధానాలను అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా ఊరట కలిగించే విషయం. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు మరింత ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే, మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం Telugunidhi వెబ్సైట్ను సందర్శించండి!
![]()
ఏపీలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ – ఉచిత బస్సు ప్రయాణం వివరాలు
తల్లికి వందనం పథకం – 72 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై బిగ్ షాక్..ఈ షరతులు తప్పనిసరి!…ఎవ్వరూ ఊహించని ట్విస్ట్?
Tags: చంద్రబాబు ప్రసూతి సెలవులు, ప్రభుత్వ ఉద్యోగుల హాలిడేస్, తల్లికి వందనం, AP ఉద్యోగుల ప్రయోజనాలు