ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Fees Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫీజులపై భారీ ఊరట లభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం రద్దు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి అమలు చేస్తామని ప్రకటించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ‘‘ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన ఫీజు బకాయిలను త్వరలోనే విడుదల చేస్తాం. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయొద్దు. ఎవరి మీదైనా ఒత్తిడి వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని స్పష్టం చేశారు.
4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పరిష్కారం | Fees Reimbursement
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత, రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇప్పటికే చెల్లించినట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపామని, వారు ఈ ప్రతిపాదనను అంగీకరించినట్టు వెల్లడించారు. ఏప్రిల్ 24 తర్వాత, కాలేజీల బ్యాంక్ ఖాతాల్లో ఈ బకాయిలను జమ చేస్తామని తెలిపారు.
ఇకపై రేషన్ కార్డు వాడదలచుకున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
విద్యా విధానంలో కీలక మార్పులు
మరోవైపు, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని ఎలాంటి యోచన లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు రిలీఫ్
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేటుగా వస్తుందేమోననే అనుమానాలు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులకు మళ్లీ రీయింబర్స్‌మెంట్ వర్తింప చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
MGNREGA Job Card Payment Status 2025 – మీ మొబైల్‌లోనే చెక్ చేసుకునే పూర్తి విధానం
ముఖ్యమైన విషయాలు:
✔️ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లింపు
✔️ పీజీ విద్యార్థులకు మళ్లీ రీయింబర్స్‌మెంట్ వర్తింపు
✔️ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే చర్యలు
✔️ ఏప్రిల్ 24 తర్వాత కాలేజీల అకౌంట్లలో ఫీజు జమ
✔️ ప్రభుత్వ ఉపాధ్యాయులపై కేసుల ఉపసంహరణ
ఏపీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, విద్యా వ్యవస్థలో మరిన్ని సానుకూల మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
Gold Loan ATM: క్షణాల్లో బంగారంపై రుణం! బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!
Tags: ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్, నారా లోకేష్ ప్రకటన, విద్యార్థులకు గుడ్ న్యూస్, ఏపీ ప్రభుత్వ విద్యా నిర్ణయం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
2 thoughts on “Fees Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గుడ్ న్యూస్ – విద్యార్థులకు మేలు!”