ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Ration Cards 2025: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ కానున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త దంపతులు, మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన వారు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో AP పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోపు దీనిని పూర్తిచేసి, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
విద్యార్థులకు శుభవార్త: ఉచిత విద్యార్థి మిత్ర కిట్లు వచ్చే విద్యాసంవత్సరం నుంచి పంపిణీ
29,000 రేషన్ దుకాణాలకు మినీ మార్ట్ రూపం | Ration Cards 2025
ఈసారి రేషన్ దుకాణాలను మినీ మార్ట్‌లుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తున్నారు. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు, మంచి నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ మార్పులు జరగనున్నాయి.
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు
గత ప్రభుత్వం హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై SIT దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమ రవాణాలో భాగమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏపీలో వీరికి రూ. 4 వేలతో కొత్త పింఛన్ల జారీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి
ఏపీ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తరఫున, నాదెండ్ల మనోహర్ పర్యాటక అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. విశాఖపట్నం కోసం ప్రత్యేక టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
50,000+ హోటల్ గదులు అందుబాటులోకి తెచ్చి, పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్రం ‘ప్రసాద్ పథకం’ కింద అన్నవరం, సింహాచలం ఆలయాలను అభివృద్ధి చేస్తోందని, గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు.
ఏపీ లోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త: తక్కువ వడ్డీతో రూ.1 లక్ష రూపాయల ఋణం
రేషన్ కార్డుల జారీ – లబ్ధిదారులకు పెద్ద ఊరట
ఈ కొత్త మార్పులతో లక్షలాది మందికి న్యాయం జరగనుంది. క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ కార్డులు, నూతన మినీ మార్ట్‌ల ఏర్పాటు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలతో రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది.
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, అర్హతలు, ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. రేషన్ కార్డు అప్డేట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను కూడా రెడీ చేయనున్నారు.
ఏపీ ప్రజలకు అలర్ట్..! ఈ తప్పు చేసిన వారికి సంక్షేమ పథకాలు రద్దు..!
Tags: AP New Ration Card 2025, కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డు క్యూఆర్ కోడ్, ఏపీ రేషన్ కార్డు అప్డేట్, AP రేషన్ దుకాణాలు