PM Kisan: ఈరోజే రూ. 2 వేలు రైతుల అకౌంట్లో జమ..పేమెంట్ స్థితిని ఇలా చెక్ చేసుకోండి

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం క్రింద 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24, 2025న అనగా ఈరోజున విడుదల కానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 2,000 ప్రతి విడత చొప్పున జమ చేయబడతాయి. ఈ వార్త ఇప్పటికే రైతుల్లో ఉత్సాహాన్ని , ఆనందాన్నికలిగించింది.

ఇక్కడ ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులకు కావాల్సిన అర్హతలు ఏంటి?, డబ్బులు వచ్చిన రైతులు పేమెంట్ స్థితిని ఎక్కడ చెక్ చేసుకోవాలి? మరియు డబ్బులు రాని రైతులు ఎక్కడ మరలా అప్లై చేసి తిరిగి డబ్బులు పొందాలి? లాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

PM Kisan 19వ విడత ముఖ్యమైన వివరాలు (2025)

  • విడుదల తేదీ : 24 ఫిబ్రవరి 2025
  • జమ అయ్యే మొత్తం : రూ. 2,000
  • సంవత్సరానికి మొత్తం సహాయం : రూ. 6,000 (3 విడతల్లో)
  • నిధుల జమ విధానం : నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి (DBT)

19వ విడతకు ఎవరు అర్హులు?

  1. భారతీయ పౌరసత్వం కలిగిన రైతులు.
  2. భూమి స్వంతం ఉన్న లేదా లీజుకు తీసుకున్న రైతులు.
  3. అనర్హులు : ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు.

డబ్బులు జమ అయ్యాయా? ఇలా చెక్ చేయండి

  1. PM Kisan అఫీసియల్ వెబ్ సైటుకుకి వెళ్లండి.
  2. Beneficiary Status ఎంచుకుని, ఆధార్ లేదా అకౌంట్ నంబర్ నమోదు చేయండి.
  3. “Get Data” క్లిక్ చేసి 19వ విడత స్టేటస్ తెలుసుకోండి.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?

  • వెబ్‌సైట్ లో Beneficiary List సెక్షన్ క్లిక్ చేయండి.
  • రాష్ట్రం, జిల్లా, గ్రామం ఎంచుకుని జాబితా డౌన్‌లోడ్ చేయండి.
  • లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.

డబ్బులు రాకపోతే ఇలా సమస్య పరిష్కరించుకోండి

  • హెల్ప్‌లైన్ : 155261 / 011-24300606
  • ఇమెయిల్ : pmkisan-ict@gov.in
  • స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

PM Kisan 19వ విడతకు ముఖ్యమైన షరతులు

  • ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి.
  • NPCI మ్యాప్ చేయబడిన బ్యాంక్ ఖాతా మాత్రమే అనుమతి.
  • భూమి రికార్డులు eKYC తో అప్‌డేట్ చేయాలి.

ఇంకా రిజిస్టర్ కాలేదా? ఇలా చేయండి

  1. pmkisan.gov.in లో New Farmer Registration ఎంచుకోండి.
  2. ఆధార్, భూమి రికార్డు వివరాలు నింపండి.
  3. లోకల్ వ్యవసాయ అధికారి ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి.

PM Kisan 19వ విడత డబ్బులు పొందడానికి మీరు అర్హత కలిగి ఉంటే, మీ వివరాలు అప్‌టు డేట్ అయి ఉండేలా చూసుకోండి. ఎటువంటి సమస్యలకు అయినా హెల్ప్‌లైన్ సంప్రదించండి. రైతులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ…

PM Kisan payment Status and full Details

మొత్తానికి కొత్త రేషన్ కార్డుల పై శుభవార్త చెప్పిన ప్రుభుత్వం

PM Kisan payment Status official Web Site గ్రూపు-2 పరీక్ష పైన కీలక ప్రకటన చేసిన ఏపీపీఎస్సీ

PM Kisan 19th Installment payment Status and full Details మహిళలకు గుడ్ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర..!

PM Kisan 19th Installment payment Status and full Details official Web Site టాటా ఇ-సైకిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.3,249 మాత్రమే

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp Join WhatsApp